సెప్టెంబర్ 8న రాష్ట్రానికి 16వ ఆర్థిక సంఘం సభ్యులు

హైదరాబాద్, వెలుగు : ఈ నెల 8వ తేదీన రాష్ట్రానికి 16వ ఆర్థిక సంఘం చైర్మన్​ అరవింద్​పనగారియా, ఇతర సభ్యులు రానున్నారు. ఈ నెల 9,10 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు, ఉన్నతాధికారులు ఆర్థిక సంఘంతో సమావేశం కానున్నారు.

ఈ సందర్భంగా అర్బన్​, రూరల్​ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన గ్రాంటులను పెంచాలని కోరనున్నారు.ఆరోగ్య శాఖకు పీహెచ్ సీలకు ఇచ్చే గ్రాంట్లు పెంచాలని అడగనున్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా కూడా పెంచమని కోరుతూ ప్రతిపాదనలు ఇవ్వనున్నారు.