హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి(ఎన్ హెచ్ 65) డ్యామేజీలపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన విషయాలపై ఆయన అధికారులతో మాట్లాడుతున్నారు. ఈ రహదారిపై ఎక్కువ డ్యామేజ్ లు అయినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. మొత్తం 17 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని, వాటిని సంస్కరించేందుకు చర్యలు తీసుకునే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. అండర్ పాస్ లు ఉన్న ప్రదేశాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై అధికారులతో మంత్రి చర్చించారు.
గ్రేటర్ లో వాటర్ ల్యాగింగ్
చిన్నపాటి వర్షానికే నగర రోడ్లు నదులను మరిపిస్తున్నాయి. దీని ప్రభావంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. కాలనీలు జలమయం అవుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి తీసుకోవాలల్సిన చర్యలపై అటు జీహెచ్ఎంసీ అధికారులతోనూ మంత్రి చర్చించారు. కొత్త రోడ్లు వేసే చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది. దీనికి తోడు తాత్కాలికంగా వేసిన రోడ్లు డ్యామేజీ అవుతున్నాయి. వాటి మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రి రివ్యూ చేస్తున్నారు. ఈ సమావేశంలో ఈఎన్సీ గణపతిరెడ్డి, నాయ్ ఆర్వో రజక్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.