జాతీయ స్థాయి టేబుల్​ టెన్నిస్​కు ఎంపిక

 జాతీయ స్థాయి టేబుల్​ టెన్నిస్​కు ఎంపిక

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న అండర్​ 17 బాల, బాలికల రాష్ట్ర స్థాయి టేబుల్​ టెన్నిస్​ పోటీలు సోమవారం ముగిశాయి. టీం చాంపియన్​ షిప్​ విభాగంలో హైదరాబాద్​ జట్లు విజయంసాధించాయి. రెండో స్థానంలో రంగారెడ్డి జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో మూడో స్థానంలో ఖమ్మం టీం నిలిచింది. బాయ్స్​ సింగిల్స్​ విభాగంలో హైదరాబాద్​కు చెందిన జతిన్​ దేవ్​ ఫస్ట్​ ప్లేస్, తరుణ్​ సెకండ్​ ప్లేస్​లో నిలిచినట్టుగా యువజన క్రీడల జిల్లా అధికారి పరంధామరెడ్డి, డీఈఓ వెంకటేశ్వరాచారి పేర్కొన్నారు.

 విజేతలకు బహుమతులను అందజేశారు. బాలికల వ్యక్తిగత సింగిల్స్​ విభాగంలో హైద్రాబాద్​కు చెందిన శశిరత, శ్రేష్టారెడ్డి,చైత్రారెడ్డి వరుసగా ఫస్ట్​, సెకండ్​, థర్డ్​ ప్లేస్​లలో నిలిచారన్నారు. హైదరాబాద్​కు చెందిన జతిన్​ దేవ్​, తరుణ్​, దేవాన్ష్​ సింగ్​, రిషబ్​సింగ్​, అరుష్​ రెడ్డిలతో పాటు స్టాండ్​బైలుగా కార్తీక్​ తేజ, పి.జ్వలిత , సుశ్రీత, శ్రేష్టారెడ్డి, చైత్రా రెడ్డిలతో పాటు స్టాండ్​ బైలుగా అవని రెడ్డి, చందన జాతీయ పోటీలకు ఎంపికైనట్టు తెలిపారు .