ప్లేస్​మెంట్​ డ్రైవ్​లో 113 మంది ఎంపిక

మంచిర్యాల, వెలుగు: సెట్విన్, తెలంగాణ భవన నిర్మాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాల జాఫర్​నగర్​లోని ఓ ఫంక్షన్​హాల్​లో నిరుద్యోగులకు ప్లేస్​మెంట్​డ్రైవ్​నిర్వహించారు. 17 కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 

మొత్తం 245 మంది హాజరు కాగా.. ప్రతిభ చాటిన 113 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వారికి అపాయింట్ మెంట్​ లెటర్లు అందజేశారు.  అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కేవీఎస్​రామ్మోహన్, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ నాగేశ్వరావు, ప్రాజెక్ట్ లీడర్ సూరిబాబు పాల్గొన్నారు.