కర్నూల్: హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ గరుడ బస్సులో 17 కిలోల గంజాయి పట్టుపబడింది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపధ్యంలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అలంపూర్ సరిహద్దులోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ-ఆంధ్ర సరిహద్దుగా ఉన్న ఈ పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఇవాళ ఆదివారం సాయంత్రం స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా బెంగళూరుకు వెళ్తున్న TSRTC( వోల్వో ప్లస్ బేరింగ్ నంబర్ టిఎస్ 08 జెడ్ 0280 ) బస్ ను (సర్వీస్ నంబర్ 1078) ఆపి తనిఖీ చేశారు. బస్సులో నాలుగు బాక్సులు అనుమానాస్పదంగా కనిపించాయి. ఎవరివి అని ప్రశ్నిస్తే ఎవరూ స్పందించలేదు. దీంతో అనుమానంతో కిందకు దించి పరిశీలించగా 17 కిలోల గంజాయి దొరికింది. బస్సును పోలీసులు ఆపి తనిఖీలు చేపట్టడం గమనించిన గుర్తు తెలియని వ్యక్తి బస్సులోనే గంజాయి వదిలేసి వెళ్లారని ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేశారు. తమ కళ్ల ముందే పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసి కర్నూలు తాలూకా పోలీసులకు బదిలీ చేశారు సెబ్ సీఐ ఎన్.లక్ష్మి దుర్గయ్య.
ఇవి కూడా చదవండి
తాడ్వాయి పవర్ ప్లాంట్ దగ్గర చిరుత సంచారం
పెళ్లి వేడుకల్లో మందు వాడకుంటే పదివేలు బహుమతి