కల్తీ లిక్కర్ బీహార్ లో అనేక ప్రాణాలను బలి తీసుకుంటోంది. రాష్ట్రంలో మద్య నిషేదం అమల్లో ఉండడంతో... విషపూరితమైన లిక్కర్ తాగి ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు. గోపాల్ గంజ్ జిల్లాలో విషపూరితమైన లిక్కర్ తాగి 9 మంది చనిపోయారు. మరో ఏడుగురు ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉన్నారు. మరోవైపు .. వెస్ట్ చంపారన్ జిల్లాలోని బేతియా లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
బీహార్ లో కల్తీ లిక్కర్ తాగి జనాలు చనిపోతున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఈ ఏడాది దాదాపు 100 మంది వరకు బలయ్యారు. అనేక మంది కంటి చూపు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. బీహార్ లో మద్య నిషేధం అమలవుతోంది.
2016లోనే మద్య నిషేధం ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్. అప్పటి వరకు లిక్కర్ కు అలవాటు పడ్డ జనాలు... తాగకుండా ఉండలేకపోతున్నారు. ఏదో ఒకటని కల్తీ మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ను కంజంప్షన్ కోసం అక్రమంగా మళ్లిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ లో మిథైల్ ఆల్కహాల్ కలిసి ఉండడంతో... జనం చనిపోతున్నారని బీహార్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. మధ్య నిషేదం అమల్లో లేని రాష్ట్రాల కంటే బీహార్ లో లిక్కర్ కంజంప్షన్ ఎక్కువగా ఉందని... ఆ మధ్య ఒక సర్వే రిపోర్ట్ బయట పెట్టింది.