జైలు నుంచి 17 మంది లగచర్ల రైతులు రిలీజ్

జైలు నుంచి 17 మంది లగచర్ల రైతులు రిలీజ్

సంగారెడ్డి, వెలుగు :  లగచర్ల ఘటన కేసులో అరెస్ట్ అయిన రైతులు శుక్రవారం జైలు నుంచి రిలీజ్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలులో 37 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌‌లో ఉన్న 17 మంది రైతులకు నాంపల్లి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.  ఈ నేపథ్యంలో వారంతా  జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వస్తూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గురువారం సాయంత్రమే రైతులు విడుదల కావాల్సి ఉండగా, జైలు అధికారులకు బెయిల్ పత్రాలు ఆలస్యంగా అందాయి. ఒక్కొక్కరికి రూ.20 వేల పూచీకత్తు, ప్రతి వారం పోలీసుల ఎదుట హాజరు కావాలనే షరతులతో కూడిన బెయిల్ లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భోగమోని సురేశ్‌‌తో పాటు మరో ఏడుగురికి బెయిల్ దక్కలేదు. .