ఇండ్లు కావాల్నంటే జాగా రాసియ్యండి

వాసాలమర్రి గ్రామసభలో ఆఫీసర్ల మెలిక
కోల్పోయిన జాగకు జాగ ఇస్తం 
మీరే కట్టుకుంటామంటే.. ఆ స్థలం చూపించి పర్మిషన్ పొందాలె
ఆర్థిక సాయం సంగతి మాకు తెల్వదు
తప్పించుకునే ప్రయత్నం: గ్రామస్తులు

యాదాద్రి, వెలుగు: ‘‘ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వాలంటే.. రూల్స్​ఒప్పుకుంటూ మీ స్థలం డెవలప్​మెంట్ కమిటీకి ఇస్తున్నట్టుగా అగ్రిమెంట్ రాసివ్వండి. ఇల్లు కట్టించి ఇస్తం. మీరే కట్టుకుంటానంటే.. పర్మిషన్ ఇస్తం, కానీ ఆ స్థలం మాకు చూపించాకే నిర్మాణం చేపట్టాలె. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం సంగతి మాకు తెలియదు. మంచిగా ఉన్న ఇండ్లకు నష్టం జరగకుండా లేఅవుట్ రూపొందించాం. ఏవైనా కొన్నింటికి నష్టం జరిగితే పరిహారం అందిస్తం. పక్కా ఇండ్లు అట్లనే ఉన్న వాళ్లకు జాగలు ఇవ్వడం మా చేతిలో లేదు’’ అని కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రి ప్రజలకు యాదాద్రి జిల్లా ఆఫీసర్లు తెలిపారు. వాసాలమర్రిని కేసీఆ ర్ బంగారంగా మార్చేస్తానని ప్రకటించిన 17 నెలల తర్వాత ఇండ్ల నిర్మాణంపై అడిషనల్ కలెక్టర్ దీపక్​ తివారి గ్రామసభ నిర్వహించారు. దత్తత తర్వాత నిర్వహించిన ప్రోగ్రామ్స్​, జరిగిన డెవలప్​మెంట్ గురించి తెలిపారు. రూ.6 కోట్ల తో కొండాపూర్ వాసాలమర్రి మధ్య జరుగుతు న్న రోడ్డు విస్తరణ గురించి ప్రస్తావించారు. గ్రా మంలోని 75 దళిత కుటుంబాలకు దళితబంధు అమలు చేసిన సంగతిని వివరించారు. ప్రభుత్వం రూపొందించిన బంగారు వాసాలమర్రి ప్లాన్​ను ఆఫీసర్లు వివరించారు. గ్రామంలో రెండు పెద్ద రోడ్లు వస్తాయని తెలిపారు. పార్కులు, కమ్యూ నిటీ హాల్స్, అంగన్​వాడీ, స్కూల్ బిల్డింగ్స్ నిర్మా ణం జరుగుతుందని వివరించారు. గ్రామంలోని 103 పక్కా భవనాలను తొలగించకుండా మిగి లిన 303 ఇండ్లను తొలగించి ఒక్కొక్కటి 200 గజాల్లో నిర్మించి ఇస్తామని తెలిపారు. కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం రూ.20 లక్షలు మంజూరైనట్టు తెలిపారు. కొత్త పంచాయతీ బిల్డింగ్ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు.

అగ్రిమెంట్లు రాసిస్తనే

డెవలప్​మెంట్ కమిటీకి ఇంటి స్థలాలు అప్పగిస్తున్నట్టు ప్రతి కుటుంబం అగ్రిమెంట్ రాసియ్యాలని ఆఫీసర్లు తెలిపారు. అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పై నుంచి అప్రూవల్ రాగానే ఇండ్ల నిర్మాణం మొదలుపెడతామని చెప్పారు. 200 గజాల కంటే ఎక్కువగా జాగ ఉండి నష్టపోయిన వాళ్లకు డెవలప్ చేస్తున్న 11 ఎకరాల్లో అంతే జాగ ఇస్తామన్నారు. బంగారు వాసాలమర్రి నిర్మాణంలో పక్కా ఇండ్లకు నష్టం జరగకుండా చూస్తామని వివరించారు.

సొంతంగా కట్టుకుంటే..

కొందరు గ్రామస్థులు తాము సొంతంగా ఇం టి నిర్మాణం చేసుకుంటే పర్మిషన్​ ఇస్తారా.? అంటూ ప్రశ్నించారు. దీంతో పర్మిషన్ ఇస్తామ ని ఆఫీసర్లు తెలిపారు. అయితే ప్లేస్​ తమకు చూపించిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. తాము సొంతంగా ఇంటి నిర్మాణం చేసుకుంటే.. సంబంధించిన వ్యయం ఇస్తుందా? అని మరికొందరు ప్రశ్నించగా అది తమ చేతుల్లో లేదని, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జరుగుతుందని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కొందరు లేచి.. తమకు ఇద్దరు ముగ్గురు సంతానం ఉన్నారని, ప్రతి ఒక్కరికి 200 గజాలు ఇస్తారా..? అని అడగ్గా.. జీ ప్లస్ 1, లేదా జీ ప్లస్​2 ఇండ్లు కట్టిస్తామని చెప్పారు.