హైదరాబాద్: నగరంలో వీధికుక్కుల దాడులు పెరిగిపోతున్నారు. గతకొన్ని నెలలుగా మహానగరంలో వీధికుక్కల దాడిలో పలువురు చనిపోగా.. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా జీహెచ్ ఎంసీ పరిధిలో మరో ఘటన జరిగింది. గురువారం ఆగస్టు 1, 2024 న బాలానగర్ లో 17మందిపై వీధికుక్క దాడి చేసింది. ఈ దాడిలో ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
గురువారం మధ్యాహ్నం బాలానగర్ లో నడుచుకుంటూ వెళ్తున్న బాలుడిపై వీధి కుక్క దాడిచేసింది. ఈ దాడిలో బాలుడి మొఖంపై తీవ్రగాయాలయ్యాయి. కంటికి సమీపంలో పెద్ద గాయమైంది. బాలుడికి చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అదే కుక్క సమీపంలోని సాయినగర్, వినాయక్ నగర్, రాజు కాలనీలో తిరుగుతూ కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేసుకుంటూవెళ్లింది.
సాయినగర్, వినాయక్ నగర్ , రాజు కాలనీలోల తిరుగుతూ 16మందిపై దాడి చేసినట్లు స్థానికులు చెప్పారు. కుక్క దాడిలో ఏడాదిన్న చిన్నారి నుంచి 16 యేళ్ల లోపు చిన్నారులున్నట్లు చెప్పారు. వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
సరిగ్గా ఏడాది క్రితం కూడా ఇదే ప్రాంతంలో ఓ వీధికుక్క దాడిలో 10మంది గాయపడ్డారని.. ఆ ఘటన మరువకముందే మరో సంఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడదనుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.