పంజాబ్‌లో 17మంది పోలీసులకు కరోనా

పంజాబ్‌లో 17మంది పోలీసులకు కరోనా

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. దేశ ప్రధానుల నుంచి అధికారుల వరకు ఎవరిని వదలడంలేదు. లాక్‌డౌన్‌ డ్యూటీలు చేస్తున్న చాలామంది పోలీసులు కూడా కరోనా బారినపడుతున్నారు. పంజాబ్‌ లో శనివారం ఒక్కరోజే 17మంది పోలీసులకు కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర పోలీసుశాఖ తెలిపింది. దాంతో పంజాబ్‌ ప్రభుత్వం పోలీసులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది.

అందులో భాగంగా సుమారు 7,165మంది పోలీసుల నుంచి నమూనాలు సేకరించగా.. వారిలో 17మందికి కరోనా లక్షణాలున్నట్లు నిర్ధారణయింది. అమృత్‌సర్‌ లో పోలీసులు లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. శని, ఆదివారాల్లో.. దుకాణాలు, మార్కెట్లు మినహా మిగతా షాపులన్నింటిని మూసివేయిస్తున్నారు. పంజాబ్ లో ఇప్పటి వరకు 2,986 కరోనా కేసులు నమోదు కాగా.. వాటిలో 641 యాక్టివ్‌ గా ఉన్నాయి. కరోనా బారినపడి ఇప్పటివరకు 63మంది మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

మహారాష్ట్రలో కూడా పోలీసులు భారీగా కరోనా బారినపడుతున్నారు. దాదాపు 3500 మంది పోలీసులకు కరోనా సోకింది.

For More News..

బ్యాంకు క్యాషియర్ కు కరోనా.. మరి ఖాతాదారుల సంగతేంటో..