గోపాల్ పేటలో ఒకే స్కూల్​ నుంచి గురుకులానికి 17 మంది విద్యార్థులు ఎంపిక

గోపాల్ పేటలో ఒకే స్కూల్​ నుంచి గురుకులానికి 17 మంది విద్యార్థులు ఎంపిక

గోపాల్ పేట, వెలుగు: మండలంలోని బుద్దారం ప్రైమరీ స్కూల్​నుంచి 17 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపికైనట్లు ఎంఈవో శ్రీనివాస్ గౌడ్  తెలిపారు. బుద్ధారం స్కూల్​కు బదిలీపై టీచర్లంతా మహిళలే వచ్చారని, వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఒకే స్కూల్​ నుంచి ఇంత మంది స్టూడెంట్లు ఎంపికయ్యారని చెప్పారు. 

విద్యార్థులకు రాత పరీక్షలు నిర్వహించి, గురుకులానికి ఎంపికయ్యేలా తీర్చిదిద్దారని అభినందించారు.  గురుకుల పాఠశాలలకు ఎంపికైన స్టూడెంట్ల తల్లిదండ్రులు స్కూల్​ టీచర్లను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. హెచ్ఎం రాజశ్రీ, టీచర్లు అనిత, నాగలక్ష్మి, సునీత, యాదమ్మ, కృష్ణ ఉన్నారు.