ఒడిశాలో దారుణం జరిగింది. ఒక 17 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ఇద్దరు దుండగులు.. 22 రోజుల పాటు అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని తిర్టోల్‌కు చెందిన బాలిక గత నెలలో తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత మనసు మార్చుకొని తిరిగి ఇంటికి రావడానికి కటక్‌లోని ఓఎంపీ స్క్వేర్ వద్ద బస్స కోసం నిలబడింది. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి.. తాను కూడా అటువైపే వెళ్తున్నానని.. బైక్ మీద డ్రాప్ చేస్తానని నమ్మించి ఎక్కించుకున్నాడు. అయితే కొంతదూరం వెళ్లాక బైకును తిర్టోల్ వైపు తీసుకెళ్లకుండా.. గాటిరౌట్‌పట్నా గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక పౌల్ట్రీ ఫామ్‌కు తీసుకెళ్లి ఒక గదిలో బందించాడు. ఆ తర్వాత అక్కడికి తన స్నేహితుడిని పిలిపించాడు. ఇద్దరూ కలిసి యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
పౌల్ట్రీ ఫామ్ వద్ద చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని అనుమానించిన కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికుల సమాచారంతో పౌల్ట్రీ ఫామ్‌పై దాడి చేసి బాలికను రక్షించినట్లు కటక్ నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ ప్రతీక్ సింగ్ తెలిపారు. నిందితులలో ఒకరిని అరెస్ట్ చేశామని.. మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాల చేత గాలింపు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. బాలికను జిల్లా శిశు సంక్షేమ కమిటీ (సిడబ్ల్యుసి) ముందు హాజరుపరిచి.. అక్కడ నుంచి అనాథాశ్రమానికి తరలించినట్లు ఆయన తెలిపారు. నిందితులపై అత్యాచారం మరియు గ్యాంగ్ రేప్‌కు సంబంధించిన ఐపీసీ సెక్షన్లు 376 (2) (సి) మరియు 376 (2) (జి), మరియు సెక్షన్ 34 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ సంఘటనపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో.. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీజేడీ ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. మహిళలకు భద్రత కల్పించడంలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం విఫలమైందని ఆ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి లేఖాశ్రీ సమంత్ సింఘర్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రతినిధి నిషికాంత్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ సామూహిక అత్యాచారంతో రాష్ట్రంలో మహిళలు సురక్షితంగా లేరని తేలిందన్నారు. యువతి కుటుంబానికి 25 లక్షలు సాయంగా అందించాలని డిమాండ్ చేస్తూ.. ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో దర్యాప్తు చేయించాలని ఆయన అన్నారు.
యువతి స్వస్థలమైన తిర్టోల్‌లో వచ్చె నెలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఘటనతో తిర్టోల్ నియోజకవర్గ ప్రజలను పాలక బీజేడీ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి.
For More News..