మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పట్టణంలో ప్రైవేటు స్కూల్ హాస్టల్ నుంచి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిస్సింగ్

  మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పట్టణంలో ప్రైవేటు స్కూల్ హాస్టల్ నుంచి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిస్సింగ్
  • పెద్దపల్లి జిల్లాలో  ఆచూకీ లభ్యం

మెట్ పల్లి, వెలుగు: మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పట్టణంలో ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి స్టూడెంట్ మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయి పెద్దపల్లి జిల్లాలో దొరికాడు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని ఆదర్శనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన నాంపల్లి లక్ష్మీనర్సయ్య కొడుకు శ్రీరామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(17) ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటూ టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చదువుతున్నాడు. మంగళవారం తెల్లవారుజామున సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. తెల్లారాక రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీరామన్ కనిపించకపోవడంతో తోటి స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమాచారమిచ్చారు.

ఆయన పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విషయం చెప్పగా స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి వెతికారు.  ఆచూకీ లభించకపోవడంతో లక్ష్మీనర్సయ్య సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రెండు టీంలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. సీడీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ ద్వారా బాలుడు పెద్దపల్లి జిల్లా కొలనూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాలుడిని పట్టుకున్నారు. 10 గంటల్లోనే  స్టూడెంట్​ను పట్టుకున్న సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై కిరణ్ కుమార్​ను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. కాగా హాస్టల్ నుంచి బాలుడు ఎందుకు వెళ్లాడో వివరాలు తెలియాల్సి ఉంది.