క్లాసులో.. పాఠాలు వింటూనే గుండెపోటుతో స్టూడెంట్ మృతి

క్లాసులో.. పాఠాలు వింటూనే గుండెపోటుతో స్టూడెంట్ మృతి

గుండెపోటుతో 17 ఏళ్ల విద్యార్థిని మృతి చెందింది. స్కూల్ కు వచ్చిన బాలిక మెట్లు ఎక్కుతుండగా అస్వస్థతకు గురైంది. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీన్ని గమనించిన స్కూల్ సిబ్బంది చిన్నారిని సమీపం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నవ్‌సారిలోని ఏబీ స్కూల్‌లో జరిగింది. 

ALSO READ:రేపే జగనన్న అమ్మఒడి పైసలు .. తల్లుల ఖాతాల్లోకి రూ. 13 వేలు

అప్పుడు తల్లి..ఇప్పుడు కూతురు..

తనీషా గాంధీ గుండెపోటుతో మరణించిందని డాక్టర్లు చెప్పడంతో తాము దిగ్ర్భాంతి వ్యక్తం చేసినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ అమృత్ ఛత్రోలా  తెలిపారు. స్కూల్ కు వచ్చిన సమయంలో బాలిక అసౌకర్యంగా కనిపించిందని..మెట్లు కూడా కష్టంగా ఎక్కిందన్నారు. రెయిలింగ్ ను పట్టుకుని ఎక్కుతుండగా అకస్మాత్తుగా కిందపడిపోయిందన్నారు. ఈ సమయంలో స్కూల్ సిబ్బందితో పాటు..సహ విద్యార్థులు సాయం చేశారని..స్కూల్ కారులోనే ఆమెను ఆసుపత్రికి తరలించామని..అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు. బాలిక తల్లి రెండేళ్ల క్రితం కరోనాతో చనిపోయిందని స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు.