- ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడి
జెరూసలెం: గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిలో గడిచిన వారం రోజుల్లో 170 మంది గన్ మెన్ ను హతమార్చామని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఈనెల 18న తెల్లవారుజామున ఆ ఆసుప్రతిలో తమ బలగాలు ప్రవేశించాయని, కూంబింగ్ నిర్వహిస్తున్నాయని మిలిటరీ తెలిపింది. ఆ కాంప్లెక్స్‌ను సొరంగ మార్గానికి అనుసంధానించారని, ఆ సొరంగాన్ని హమాస్ టెర్రరిస్టులు, పాలస్తీనియన్ ఫైటర్ల కోసం వాడుతున్నారని పేర్కొంది.
‘‘గత వారం రోజుల్లో అల్ షిఫా హాస్పిటల్ ప్రాంతంలో 170 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టాం. 800 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాం. ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో ఆయుధాలు, టెర్రర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను గుర్తించాం” అని ఇజ్రాయెల్ మిలిటరీ వివరించింది.