హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్లో 172 మంది సెక్షన్ ఆఫీసర్ల (ఎస్వో)ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ శాఖల్లో దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న సెక్షన్ అధికారులను ఇతర శాఖలకు ట్రాన్స్ఫర్ చేశారు.
సాధారణ పరిపాలన శాఖలో 31 మంది ఎస్ఓలు బదిలీ అయ్యారు. వీరి స్థానాల్లో ఆర్ అండ్ బీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి ఎస్వోలను తీసుకున్నారు. చాలా ఏండ్ల తర్వాత భారీ స్థాయిలో ఎస్వోలను ప్రభుత్వం బదిలీ చేసింది.