న్యూఢిల్లీ: ఎడ్టెక్ కంపెనీ ఫిజిక్స్‌వాలా 210 మిలియన్ డాలర్ల (రూ. 1,743 కోట్ల) ను సేకరించింది. హార్న్‌బిల్ క్యాపిటల్ నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్లో 2.8 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ దగ్గర ఈ ఫండ్స్ సేకరించింది. లైట్ స్పీడ్ వెంచర్ పార్టనర్స్, జీఎస్వీ,వెస్ట్‌బ్రిడ్జ్ వంటి ఇన్వెస్టర్లు ఈ ఫండింగ్‌లో రౌండ్లో పాల్గొన్నారు. గత ఫండింగ్ రౌండ్లో ఫిజిక్స్‌వాలా వాల్యుయేషన్ 1.1 బిలియన్ డాలర్లు ఉండగా, తాజాగా ఇది 2.5 రెట్లు ఎక్కువ పలికింది. బైజూస్ ఫెయిల్యూర్ తర్వాత ఇండియా ఎడ్టెక్ కంపెనీల వాల్యుయేషన్స్ భారీగా పడిపోయిన విషయం తెలిసిందే.