సర్కారీ కొలువులంటే జనాలు ఏమీ ఆలోచించడం లేదు. ఎంత ఉన్నతస్థాయి చదువు చదివినా చపరాసీ ఉద్యోగాలకు నిరుద్యోగులు ఎగబడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో 16 ఫ్యూన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడితే.. 1779 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఉద్యోగాలకు పీజీ నుంచి ఎంఫిల్ వరకు చదివిన వారు దరఖాస్తు చేసుకున్నారు. సహజంగా ఫ్యూన్ ఉద్యోగానికి 8 వతరగతి చదివితే సరిపోతుంది. లెక్చరర్ స్థాయిలో ఉద్యోగం చేయాల్సిన వారు ఫ్యూన్ గా మారేందుకు సిద్దపడ్డారు.
ఫ్యూన్ కోసం.. ఎంఫిల్ అభ్యర్థులు
ఛతర్‌పూర్ జిల్లాలోని మహారాజా ఛత్రసల్ బుందేల్‌ఖండ్ విశ్వవిద్యాలయంలో . ఇక్కడ 16 ప్యూన్ పోస్టుల భర్తీకి వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో పీజీ విద్యార్హత ఉన్నవారు 400 మంది, గ్రాడ్యుయేట్లు ఉన్నవారు 800 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంఫిల్ , పీజీ గ్రాడ్యుయేట్లు 8వ తరగతి చదివిన వారు చేసే నాలుగోతరగతి ఫ్యూన్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు.
జూన్ 4న రాత పరీక్ష
నాలుగో తరగతి పోస్టులకు జూన్ 4న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు మహారాజా ఛత్రసల్ బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్‌డీ చతుర్వేది తెలిపారు. ఈ పరీక్షలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లాలోని రెండు కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. రాత పరీక్ష తర్వాత ఫలితాలు వెలువడుతాయి. పరీక్షను పూర్తి పారదర్శకంగా, న్యాయంగా నిర్వహిస్తామని ఎస్‌డి చతుర్వేది తెలిపారు. అయితే ఈ పరీక్షపై కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. పరీక్ష సమయంలో హైకోర్టు నుండి ఏదైనా సూచన వస్తే, ఈ పరీక్షను కూడా వాయిదా వేసే అవకాశం ఉంది.
సర్కారీ కొలువులపై ఆశక్తి
పీజీ, ఎంఫిల్ పూర్తి చేసిన వారికి బయట చాలా అవకాశాలుంటాయి. అయినా టీ,మంచినీళ్లు అందించి... నైట్ వాచ్ మెన్ లాంటి ఉద్యోగానికి కూడా సిద్దపడ్డరంటే ప్రభుత్వ ఉద్యోగానికి ఎంత డిమాండ్ వేరే చెప్పనక్కరలేదు. సర్కారీ కొలువంటే పని ఒత్తిడి తక్కువ.. రిటైర్ అయిన తరువాత పెన్షన్, ఇతర అలవెన్సులు వస్తాయని నిరుద్యోగులు ఎగబడుతున్నారు.