కరీంనగర్ టౌన్,వెలుగు : అభ్యర్థులు, ప్రజల సహకారంతో ఎంపీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకుందామని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో అబ్జర్వర్లు అమిత్ కటారియా, అశ్వనికుమార్ పాండేతో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీ పరిధిలో 17,97,150 మంది ఓటర్లు ఉండగా, అందులో 9,19,565 మంది మహిళలు,8,77,484 మంది పురుషులు ఉన్నారన్నారు.
మొత్తం 2,194 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ సెంటర్లలో అన్ని వసతులు కల్పిస్తామన్నారు. మే 3వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు హోం ఓటింగ్ చేపడతామన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉల్లంఘనలపై ఆర్అండ్‌బీ గెస్ట్ హౌజ్‌లో లేదా 9177435833 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు.