సన్ రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ జూలు విదిల్చాడు. ఆడుతున్న తొలి ఐపీఎల్ మ్యాచ్ లోనే విధ్వంసం సృష్టించాడు. ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బౌండరీలతో హోరెత్తించాడు. పవర్ ప్లేలో ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఆసీస్ స్టార్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. హెడ్ ఊపుతో మొదటి 7 ఓవర్లలోనే సన్ రైజర్స్ వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఎస్ఆర్ హెచ్.. తొలి ఓవర్లో కేవలం 7 పరుగులు రాబట్టింది. అయితే అసలు విధ్వంసం రెండో ఓవర్ నుంచి మొదలైంది. తర్వాత 5 ఓవర్లలో ఏకంగా 74 పరుగులు పిండుకుంది. సౌతాఫ్రికా యువ బౌలర్ మఫాకా వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఏకంగా 22 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే తర్వాత సన్ రైజర్స్ విధ్వంసం కాలేదు. చావ్లా వేసిన 7 ఓవర్లో 3 సిక్సులతో మొత్తం 21 పరుగులు బాదారు. 11 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ ఔటయ్యాడు.
WELCOME BACK TO THE IPL, TRAVIS HEAD.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 27, 2024
A 18 BALL FIFTY TO MARK HIS RETURN - WHAT AN ONSLAUGHT BY HEAD AGAINST MI. pic.twitter.com/JOXB87kG7U