ప్రహరీ కూలి18 బైకులు ధ్వంసం

ప్రహరీ కూలి18 బైకులు ధ్వంసం

దిల్​సుఖ్ నగర్, వెలుగు: చైతన్యపురిలోని గడ్డిఅన్నారం ఫ్రూట్​మార్కెట్​ స్థలంలో ప్రస్తుతం టిమ్స్​ హాస్పిటల్​నిర్మాణం జరుగుతోంది. పనుల్లో భాగం సెల్లార్​ కోసం తవ్విన మట్టిన ప్రభాత్​నగర్​ కాలనీ వైపు ఉన్న ప్రహరీ పక్కన పెద్దఎత్తున పోశారు. ప్రహరీపై భారం పడి శనివారం ఉదయం కూలింది. గోడను ఆనుకుని బయటవైపు పార్క్​చేసి18 బైకులు ధ్వంసమయ్యాయి. ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతోనే గోడ కూలిందని కాలనీవాసులు ఆరోపించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని చైతన్యపురి ఇన్​స్పెక్టర్​ వెంకటేశ్వరరావు తెలిపారు.