వైట్ గూడ్స్ కోసం PLI పథకం : వైట్​గూడ్స్​ పీఎల్​ఐ స్కీమ్​కు 18 కంపెనీలు

వైట్ గూడ్స్ కోసం PLI పథకం : వైట్​గూడ్స్​ పీఎల్​ఐ స్కీమ్​కు 18 కంపెనీలు

న్యూఢిల్లీ: ఏసీలు, ఫ్రిజ్​లు వంటి వైట్​గూడ్స్ తయారీ పెంచడానికి తెచ్చిన ప్రొడక్షన్ ​లింక్డ్‌‌‌‌‌‌‌‌ ​ఇన్సెంటివ్​(పీఎల్​ఐ)​ స్కీమ్​కు 18 కంపెనీలు ఎంపిక అయ్యాయి. వీటిలో వోల్టాస్​, మిర్క్​ఎలక్ట్రానిక్స్​, ల్యూమాక్స్​, యునో మిండా వంటి కంపెనీలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇవి రూ.2,299 కోట్లు ఇన్వెస్ట్​ చేస్తాయి. పీఎల్​ఐ స్కీమ్​ కోసం గత ఏడాది 38 కంపెనీలు దరఖాస్తులు ఇచ్చాయి. తాజాగా ఎంపికైన వాటిలో ఇది వరకే పీఎల్ఐకు అర్హత సాధించిన కొన్ని కంపెనీలు ఉన్నాయి. 

ఇవి అదనంగా రూ.1,217 కోట్లు ఇన్వెస్ట్ ​చేస్తామని ప్రకటించాయి. ఏసీలు కంపెనీలు కంప్రెసర్స్​, కాపర్ ​ట్యూబ్స్​, హీట్ ​ఎక్స్చేంజర్స్​ వంటి కాంపోనెంట్లను తయారు చేస్తాయి. ఎల్ఈడీ లైట్లు, ఎల్​ఈడీ  చిప్​ ప్యాకేజింగ్​, డ్రైవర్స్​, ఇంజన్స్​ ఉత్పత్తిని కూడా పెంచుతాయి. ఇప్పటి వరకు 84 వైట్​గూడ్స్ కంపెనీలు పీఎల్​ఐ పథకానికి ఎంపికయ్యాయి. ఇవి రూ.10,478 కోట్లు ఇన్వెస్ట్​  చేయడం వల్ల రూ.1.72 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి జరుగుతుంది.