కాగజ్ నగర్, వెలుగు: కాగజ్‌నగర్ పట్టణంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా వాడుతున్నట్లు 18 డొమెస్టిక్ సిలిండర్లను గుర్తించి సీజ్ చేశారు. పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌక్‌లో ఉన్న మున్నీ హోటల్లో 7 సబ్సిడీ సిలిండర్లు, మున్నీ బార్ అండ్ రెస్టారెంట్లో 5 పెట్రోల్ పంపు సమీపంలోని కాకతీయ మెస్‌లో 6 సబ్సిడీ సిలిండర్లు పట్టుబడినట్లు డిప్యూటీ తహసీల్దార్లు రాజ్ కుమార్, శ్యామ్ లాల్, శ్రీనివాస్ తెలిపారు.
ఆ సిలిండర్లను స్వాధీనం చేసుకొని, హోటల్ యజమానులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. హోటల్ యజమానులు కమర్షియల్ సిలిండర్‌కు బదులుగా ప్రభుత్వ రాయితీ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.