ఇదీ గూడెం గుంతల దారి

ఇదీ గూడెం  గుంతల దారి
  •  18 కి.మీ. మేర అడుగుకో గుంత
  •     నిధులు మంజూరైనా  ఫారెస్ట్ శాఖ కొర్రీ 

కాగజ్ నగర్, వెలుగు: అడుగడుగునా గుంతలు.. తారు లేచిపోయి కంకర తేలి పూర్తిగా ఛిద్రమైన ఆ రోడ్డుపై ప్రయాణమంటేనే జనాలు జంకుతున్నారు. గుంతలతో నిండిలో ఆ రోడ్డులో అరగంటలో చేరుకోవాల్సిన దూరాన్ని గంటదాటినా చేరుకోవడంలేదు. చింతలమానేపల్లి–గూడెం మెయిన్ రోడ్డు దుస్థితి ఇదీ.. కర్జెల్లి నుంచి గూడెం వరకు అడవిలో ఉన్న 18 కిలోమీటర్ల రోడ్డు భారీ గుంతలమయమై ఆధ్వానంగా మారింది.

కాగజ్ నగర్, కౌటాలతో పాటు అనేక ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. నిత్యం వందలాది వాహనాలు, ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి. అయితే ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో అధ్వానమైంది. కొన్నిచోట్ల మోకాలు లోతు గుంతల కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది.

అడవిలో ఉన్న ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా ఫారెస్ట్ క్లియరెన్స్ రాకపోవడంతో ప్రజలకు తిప్పలు తప్పడంలేదు. మూడు దశాబ్దాల క్రితం వేసిన రోడ్డు రిపేర్లు చేసేందుకు కూడా అటవీ శాఖ అనుమతి ఇవ్వకపోవడం పట్లు ప్రజలు మండిపడుతు న్నారు. ప్రయాణికులు పడుతున్న పాట్లను గుర్తిం చైనా ఫారెస్ట్ ఆఫీసర్ రిపేర్లకు పర్మిషన్​ఇవ్వాలని  కోరుతున్నారు.