యాదగిరిగుట్ట నరసన్నకు రూ.18 లక్షల విరాళం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యాన్నదానానికి హైదరాబాద్​కు చెందిన భక్తుడు రూ.18 లక్షలను విరాళంగా అందజేశారు. అజశ్రా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున నిమ్మగడ్డ రామకృష్ణారావు, జ్యోతి దంపతులు..

ఇందుకు సంబంధించిన చెక్కును ఆలయ ఈవో భాస్కర్ రావుకు మంగళవారం అందజేశారు. అనంతరం దాతలు గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు అందజేశారు.