కుక్కలను కాపలా పెట్టి.. ఫౌమ్​హౌస్​లో పత్తాలాట

కుక్కలను కాపలా పెట్టి.. ఫౌమ్​హౌస్​లో పత్తాలాట
  •     మేడ్చల్​ జిల్లా పూడురులో బడాబాబుల బాగోతం
  •     18 మంది అరెస్ట్..  రేంజ్ రోవర్ కార్లు, విలువైన మద్యం సీజ్​

మేడ్చల్, వెలుగు:  ఫామ్​హౌస్​లో కుక్కలను కాపలాగా పెట్టి పత్తాలాటలో మునిగి తేలుతున్న బడాబాబులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి నాలుగు రేంజ్​రోవర్​కార్లు, ఒక బీఎండబ్ల్యూ, రెండు ఇన్నోవా క్రిస్టా వాహనాలు సహా మొతం 12 వెహికల్స్​.. రూ. 4 .50 లక్షల నగదు, భారీగా లిక్కర్​ సీజ్​ చేశారు. పేకాట ఆడుతూ దొరికిన వాళ్లలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు, రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు ఉన్నట్లు సమాచారం.

 మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా పూడూరులోని ఓ ఫామ్​హౌస్​లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్​వోటీ పోలీసులు ఆదివారం  అక్కడికి వెళ్లారు. అక్కడ కాపలాగా ఉన్న కుక్కలు.. పోలీసులను లోపలికి వెళ్లకుండా కొంతసేపు అడ్డుకున్నాయి. అయినా.. పోలీసులు లోపలికి వెళ్లి, పేకాట ఆడుతున్న 18 మందిని అరెస్టు చేశారు. దొరికినవాళ్లలో అందరూ బడాబాబులే ఉన్నట్లు తెలుస్తున్నది. వారిని పోలీసులు మేడ్చల్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. కేసు నమోదు చేసి వాహనాలను సీజ్​ చేసినట్లు మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ ఫామ్​హౌస్​ఎస్​.శ్రీనివాస్​రావు అనే వ్యక్తిగా తెలుస్తున్నది.