గద్వాల, వెలుగు : రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు 18 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు గద్వాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డీకే స్నిగ్ధారెడ్డి, జనరల్ సెక్రటరీ నరసింహ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఇండోర్ స్టేడియంలో సీనియర్ కబడ్డీ సెలక్షన్స్ పోటీలు నిర్వహించారు. ఈ సెలక్షన్స్ కి జిల్లాలోని వివిధ మండలాల నుంచి దాదాపు 50 మంది క్రీడాకారులు హాజరయ్యారు.
అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 18 మంది క్రీడాకారులను సెలెక్ట్ చేశారు. ఎంపికైన వారు ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు ఆదిలాబాద్ లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ అబ్రహం, మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మావతి, పీడీలు స్రవంతి, జగదీశ్, రాజేంద్ర తిరుపతి తదితరులు పాల్గొన్నారు.