18 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

18 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

అలంపూర్, వెలుగు :  అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను గద్వాల జిల్లా ఉండవల్లి పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు.  కొందరు వ్యక్తులు పత్తి విత్తనాలను తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో ఉండవల్లి పోలీసులతో పాటు, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు గురువారం రాత్రి పుల్లూరు చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.

ఈ టైంలో ఏపీలోని నంద్యాల నుంచి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్తున్న ఓ బొలెరోను ఆపి తనిఖీ చేయగా నకిలీ పత్తి విత్తనాలు కనిపించాయి. దీంతో వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోటేశ్వరరావుపై కేసు నమోద చేయడంతో పాటు రూ. 9 లక్షల విలువైన 18 క్వింటాళ్ల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏవో సురేఖ, సీఐ రవిబాబు ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించినట్లు ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ సుబ్బారెడ్డి తెలిపారు.

మాడ్గుల్‌‌, కేశంపేటలో 9.30 క్వింటాళ్లు...

ఆమనగల్లు, వెలుగు : అక్రమంగా నిల్వ చేసిన నకిలీ పత్తి విత్తనాలను రంగారెడ్డి జిల్లా మాడ్గుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు పట్టుకున్నారు. మాడ్గుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలోని కొత్త బ్రాహ్మణపల్లిలో కొందరు వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలు నిల్వ చేసినట్లు పోలీసులకు సమచారం అందింది. దీంతో గురువారం రాత్రి దాడులు చేసి డి.మర్రెడ్డి, ఎ.మర్రెడ్డి, వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అనే వ్యక్తుల వద్ద నుంచి 80 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.

వారు ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సుందరాపురం గ్రామానికి చెందిన మల్లారెడ్డి, షాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న ఏపీకి చెందిన సత్యపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 8.50 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 9.30 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు, వేయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెషీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కారు, మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్లు స్వాధీనం చేసుకొని, ఐదుగురిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినట్లు మాడ్గుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఐ విష్ణువర్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు.