వన్ నేషన్ -వన్ ఎలక్షన్ సాధ్యమేనా.. లోక్ సభ ముందూ తర్వాత ఏయే రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయంటే..?

వన్ నేషన్ -వన్ ఎలక్షన్ సాధ్యమేనా.. లోక్ సభ ముందూ తర్వాత ఏయే రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయంటే..?

దేశంలో వన్ నేషన్ వన్ పోల్ సాధ్యాసాధ్యాలపై మోదీ ప్రభుత్వం కసరత్తుల చేస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ రాజకీయ పార్టీలు, రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే వన్ నేషన్ వన్ పోల్ సాధ్యమేనా.. ?  అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నిలకు రాష్ట్రాలు ఒప్పుకుంటాయా..?  మోదీ ప్రభుత్వం ఒప్పిస్తుందా..?  ఇప్పటివరకు లా కమిషన్ ద్వారా నివేదికపై ఆధారపడిన మోదీ ప్రభుత్వం.. తాజా మాజీ రాష్ట్రపతి  ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా సమస్యపై నిర్ణయాత్మకంగా  ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. 

అయితే సెప్టెంబర్ నెలాఖరులో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్.. వన్ పోల్ బిల్లు వచ్చే అవకాశం లేదంటున్నారు నిపుణులు.. ఒకవేళ బిల్లు ప్రవేశపెట్టే అశకాశం ఉన్నా.. వన్ నేషన్.. వన్ పోల్ ద్వారా లోక్ సభతో పాటు ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాలను మోదీ ప్రభుత్వం ఒప్పించాల్సి ఉంటుంది. అయితే ఇది ఎంత వరకు సాధ్యం.. 

లోక్ సభతోపాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాలు : ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం

లోక్ సభ ఎన్నికలకు ఐదు నెలల ముందు ఎన్నికలు జరిగే రాష్ట్రాలు : తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, మిజోరాం

లోక్ సభ ఎన్నికల తర్వాత ఐదు నెలలకు ఎన్నికలు జరిగే రాష్ట్రాలు : హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ కు వెళ్లాలి అని నిర్ణయించుకుంటే.. ఐదు నెలల ముందు.. ఐదు నెలల తర్వాత ఎన్నికలు జరిగే తొమ్మిది రాష్ట్రాలను ఒప్పించాల్సి ఉంటుంది. ఇది సాధ్యం అయ్యే పనేనా..

గడువు ముగిసిన రాష్ట్రాల్లో గవర్నర్ పాలన పెట్టి ఆరు నెలలు నెట్టుకురావొచ్చు.

అదే విధంగా ఐదు నెలల ముందు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేయాల్సి ఉంటుంది.

ఈ లెక్కన 13 రాష్ట్రాలను కలుపుకుని వన్ నేషన్.. వన్ ఎలక్షన్ కు తొలి అడుగు పడొచ్చు..

మోదీ ప్రభుత్వం.. అంటే కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళితే ఇలా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కేంద్రమే ముందస్తు ఎన్నికలకు వచ్చినట్లయితే మిగతా రాష్ట్రాలను అసెంబ్లీ రద్దుకు ఒప్పించాల్సి ఉంటుంది. ఇలాంటి ఎన్నో చిక్కులు, సవాళ్లు ఇప్పుడు రాంనాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ ముందు ఉన్నాయి.