రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఆశా కాలనీలో పట్టపగలే 18.5 తులాల బంగారం చోరీ జరగడం కలకలం రేపింది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో పట్టపగలే దొంగతనం జరగడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.
యజమాని శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భవనం మొదటి అంతస్తులో నివాసం ఉంటున్న తమ కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లారు. శ్రీనివాసరెడ్డి ఉదయం 8:30 కు ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్ళాడు. రాత్రి 8 గంటలకు వచ్చి చూడగా ఇల్లు తెరిచి ఉండటం గమనించాడు. బీరువాలో దాచి ఉంచిన 18.5 తులాల బంగారాన్ని చోరీ చేసినట్లు తెలిపారు. ఒక రాడ్డు సహాయంతో తాళాన్ని బద్దలు కొట్టి బంగారం చోరీ చేసినట్లు తెలిపారు. వెంటనే100 కు డయల్ చేయగా పోలీసులు వచ్చి దర్యాప్తు ప్రారంభించారు.