భోపాల్లో రూ. 1800 కోట్ల డ్రగ్స్ సీజ్.. ఇద్దరు అరెస్ట్

భోపాల్లో  రూ. 1800 కోట్ల డ్రగ్స్ సీజ్.. ఇద్దరు అరెస్ట్

మధ్యప్రదేశ్  రాజధాని భోపాల్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ ఫ్యాక్టరీలో రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు  ఇద్దరు నిందితులను  అరెస్ట్ చేశారు. 

భోపాల్‌ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో మాదకద్రవ్యాలు తయారు చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో  గుజరాత్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి),   యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఫ్యాక్టరీపై దాడి చేసి రూ. 1814 కోట్ల విలువైన  మెఫెడ్రోన్  డ్రగ్స్ ను  స్వాధీనం చేసుకున్నాయి. 

ALSO READ | 18మంది సైబర్ నేరగాళ్లపై 319కేసులు..

ఇద్దరు  కీలక నిందితులు సన్యాల్ ప్రకాష్ బానే .. అమిత్ చదుర్వేదిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీళ్లిద్దరు   ఆరు నెలల క్రితం భోపాల్ లోని బగ్రోడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక షెడ్డును అద్దెకు తీసుకున్నారు.  నిషేధిత సింథటిక్ డ్రగ్ అయిన మెఫెడ్రోన్‌ను తయారు చేస్తున్నారు. 

రోజుకు 25 కిలోల ఎండీని(మెఫెడ్రోన్) ఉత్పత్తి చేస్తున్న ఈ ఫ్యాక్టరీ అక్రమ డ్రగ్స్ తయారీకి ప్రధాన కేంద్రంగా మారింది. ఈ దాడిలో అధికారులు 907 కిలోల మెఫెడ్రోన్‌తో పాటు 5 వేల కిలోల ముడిసరుకు,  డ్రగ్ తయారీకి వాడే  సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.