
- వీరిలో పిల్లలే ఎక్కువ
- నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నం
- బల్దియా కమిషనర్ ఇలంబరితి
హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశంలో కుక్క కాట్లతో రేబిస్ సోకి ఏటా18 వేల నుంచి 20 వేల మంది చనిపోతున్నారని, వీరిలో ఎక్కువ మంది15 ఏండ్లలోపు వారేనని బల్దియా కమిషనర్ఇలంబరితి చెప్పారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్బయోటెక్నాలజీలో శుక్రవారం నేషనల్సైన్స్డే నిర్వహించారు. కమిషనర్ఇలంబరితి హాజరై పలు అంశాలపై మాట్లాడారు. వీధి కుక్కల నియంత్రణ కోసం 80 శాతం స్టెరిలైజేషన్ చేశామన్నారు. పెట్స్యాజమానులు కచ్చితంగా వ్యాక్సిన్వేయించాలన్నారు.
డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా జనాలపై ప్రభావం చూపుతున్నాయని, దీనిపై బల్దియా ఇంటిగ్రేటెడ్ వెక్టర్ కంట్రోల్ ప్రోగ్రాం, రియల్ టైం, డిసీస్ ట్రాకింగ్ చేపట్టిందన్నారు. మనుషులు, జంతువులు యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉపయోగించడంతో రోగ నిరోధక శక్తి తగ్గి రోగాల భారిన పడుతున్నారన్నారు. ఎన్ఐఏబీ డైరెక్టర్ డా.జి.తారు శర్మ, స్టూడెంట్స్ పాల్గొన్నారు.