ఖమ్మం: చివరి రోజు భారీ నామినేషన్లు

 

ఖమ్మం/ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.  మొత్తం 183 వచ్చాయి. 

  • ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్కరోజే 87 నామినేషన్లు వచ్చాయి. అత్యధికంగా ఖమ్మంలో 28 నామినేషన్లు, పాలేరుకు 19, మధిరకు 15, వైరాకు 10, సత్తుపల్లికి 15 మంది నామినేషన్లు వేశారు.  చివరిరోజు ఖమ్మంలో బీఆర్ఎస్ తరపున మంత్రి అజయ్ నామినేషన్ వేశారు.  
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు గానూ చివరి రోజు ఒక్కరోజే 96నామినేషన్లు దాఖలయ్యాయి. పినపాకలో 12 మంది 19 నామినేషన్లు, ఇల్లెందులో 15 మంది 28 నామినేషన్లు, కొత్తగూడెంలో 14 మంది 26 నామినేషన్లు, అశ్వారావుపేటలో 8మంది 17 నామినేషన్లు, భద్రాచలంలో ఐదుగురు ఆరు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నెల 3వ తేదీ నుంచి మొదలైన నామినేషన్ల ప్రక్రియ 10వ తేదీన ముగిసింది
  • జిల్లాలోని ఇల్లెందు,కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాలకు మొత్తం 136 మంది క్యాండెట్లు 211 నామినేషన్లను వేశారు. అత్యధికంగా ఇల్లెందు నియోజకవర్గంలో 59నామినేషన్లు దాఖలు కాగా భద్రాచలం నియోజకవర్గంలో తక్కువగా 26 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. చివరి రోజున కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ క్యాండెట్ వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే వనమా భార్య పద్మావతితోనూ మరో సెట్ నామినేషన్లు వేశారు. 
  • ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుపున మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, బీజేపీ మద్దతుతో జనసేన తరుపున లక్కినేని సురేందర్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం తరుపున శ్రావణ బోయిన నర్సయ్య నామినేషన్లు వేసిన వారిలో ప్రధానంగా ఉన్నారు. 

కొత్తగూడెంలో ఉద్రిక్తత

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం కొత్తగూడెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్తగూడెం ఆర్డీవో ఆఫీస్​లో నామినేషన్​ వేసేందుకు బీఆర్ఎస్​క్యాండిడేట్, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన అనుచరులతో వచ్చారు. అనుచరులతో బస్టాండ్​ సెంటర్​లో గుమిగూడారు. ఇదే టైంలో మాజీ ఎమ్మెల్యే, ఆల్​ ఇండియా ఫార్వర్డ్​ బ్లాక్​ పార్టీ క్యాండెట్​ జలగం వెంకట్రావు​అనుచరులు రావడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలను అదుపు చేసేందుకు పొలీసులు నానా తంటాలు పడ్డారు. వనమా, జలగం నామినేషన్లు వేసి వచ్చేంత వరకు రద్దీతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. 

ALSO READ: మంత్రి తలసానికి చెక్ పెడ్తరా! .. మినీ భారత్ సనత్​నగర్​లో గెలుపు ప్రతిష్టాత్మకం