పర్ణశాల హుండీ ఆదాయం రూ.18.52 లక్షలు

పర్ణశాల హుండీ ఆదాయం రూ.18.52 లక్షలు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధ ఆలయం దుమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయంలో గురువారం హుండీలు లెక్కించారు. ఈవో రమాదేవి ఆధ్వర్యంలో సిబ్బంది ఈ లెక్కింపులో పాల్గొనగా 276 రోజులకు రూ.18,52,402 ఆదాయం వచ్చింది.

2 యూఎస్​ఏ డాలర్లు కూడా వచ్చాయి. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ఉదయం గర్భగుడిలో సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. బేడా మండపంలో నిత్య కల్యాణం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.