కరోనా కేసులు రాష్ట్రంలో పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్రంలో కొత్తగా 1891 కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 66,677కు చేరింది. కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1088గా నమోదయింది. మొత్తం ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారు 47,590గా ఉంది. శనివారం కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 540కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,547 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. వీటన్నింటి ద్వారా రాష్ట్రంలో రికవరీ రేటు 71.3%గా నమోదయింది. దేశంలో రికవరీ రేటు 64.53% కన్నా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్న వారి సంఖ్య 12,001గా నమోదయింది. శనివారం రాష్ట్రంలో 19,202 టెస్టులు చేశారు. ఇప్పటివరకు 4,77,795 టెస్టులు చేసినట్లుగా ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 517 కేసులు, రంగారెడ్డిలో 181 కేసులు, వరంగల్ అర్బన్ లో 138 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరిలో 146 కేసులు, నిజామాబాద్ లో 131 కేసులు, , సంగారెడ్డిలో 111 కేసులు, కరీంనగర్ లో 93 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
For More News..