మీరు ఏదైనా వస్తువు కొన్నారా.. కొంటే కచ్చితంగా జీఎస్టీ కట్టాలి. ఇంట్లో తినే ఉప్పు, పప్పు నుంచి అగ్గిపెట్టె వరకు అన్నింటికీ జీఎస్టీ కడుతున్నారు.. ఇక నుంచి కొంటేనే కాదు.. అమ్మినా కూడా జీఎస్టీ కట్టాలి. అవును.. మీరు మీ పాత కారు అమ్మాలనుకుంటున్నారా.. డోంట్ వర్రీ.. హాయిగా అమ్ముకోండి.. కాకపోతే.. పాతవి అమ్మితే వచ్చి డబ్బులపై జీఎస్టీ కట్టండి..మీరు మీ పాత కారును లక్ష రూపాయలకు అమ్మారు అనుకుంటే..18 వేల రూపాయలు జీఎస్టీ పన్ను కట్టాలి అంట..ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ పూర్తి వివరాలు తెలుసుకుందామా..
ఇటీవల జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో సహా అన్ని రకాల వెహికల్స్ అమ్మినా కూడా జీఎస్టీ చెల్లించాలి. దేశవ్యాప్తంగా యూజ్డ్ కార్ల మార్కెట్ బాగా నడుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలమ్మ. వేగంగా విస్తరిస్తున్న ఈ పాత కార్ల బిజినెస్ లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారని.. ప్రభుత్వం ఆదాయం పెంచుకునే క్రమంలో పాత కార్ల అమ్మకంపై జీఎస్టీ వేస్తున్నారని తెలుస్తోంది.
జీఎస్టీ ఎలా లెక్కిస్తారు?
పాత వెహికల్స్ కొనుగోలు ధర, అమ్మిన ధరను బట్టి జీఎస్టీ నిర్ణయించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కొనుగోలు, అమ్మకం రేట్ల మధ్య ఉన్న మార్జిన్ ఆధారంగా జీఎస్టీ నిర్ణయిస్తామని చెప్పింది. ఉదాహరణకు 12లక్షలకు ఓ కారు ను కొన్నట్లయితే.. దానిని 9లక్షలకు అమ్మితే వాటి మధ్య ఉన్న మార్జిన్ పై 18 శాతం జీఎస్టీ ఉంటుందని అన్నారు.
ALSO READ | ఒకే రోజు 3,200 షోరూమ్ల ఓపెనింగ్.. 25 వేల డిస్కౌంట్.. ట్రెండ్ సెట్ చేసిన ఓలా
అయితే మార్జిన్ ఎలా నిర్ణయించబడుతుందనే దానిపై వివరణ ప్రశ్నలను లేవనెత్తింది.GST పెరుగుదల అంతిమంగా అమ్మకందారులకు నష్టాలకు దారితీస్తుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వాడిన కార్ల అమ్మకాలపై 18శాతం GST ఎందుకు..
జాతీయ సమాచార, టెక్నాలజీ డిపార్టుమెంట్ ఇన్ ఛార్జ్ అమిత్ మాల్వియా పాత కార్ల అమ్మకంపై జీఎస్టీ నిర్ణయం పై ఇచ్చిన వివరణ ప్రకారం.. 18శాతం GST అనేది వాహనంపై అమ్మిన ధర, కొనుగోలు ధర మధ్య వ్యత్యాసం,డీలర్ల మార్జిన్‌పై మాత్రమే లెక్కించబడుతుంది..అయితే వాహనం మొత్తం విలువపై కాదు అని చెప్పారు. ఈ విధానంలో పన్ను డీలర్ నిర్ణయించిన మార్జిన్ పైనే జీఎస్టీ నిర్ధారణ ఉంటుంది. ఇది GST ఫ్రేమ్‌వర్క్ కింద ఒక సర్వీస్ గా పరిగణించబడుతుంది.
ఎందుకు వచ్చిందీ ఆలోచన..
దేశవ్యాప్తంగా యూజ్డ్ కార్ల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది.ఇండియన్ బ్లూ బుక్ 2023 ప్రకారం.. భారత్ లో ఒక్క 2022-23 లోనే 31.33 బిలియన్ల డాలర్ల విలువైన కార్ల అమ్మకాలు జరిగాయి. 2027-28 నాటికి 70.48 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనావేస్తున్నారు.
FY2017 నుంచి FY2022 మధ్య 6శాతం ఉన్న యూజ్డ్ కార్ల మార్కెట్ సగటు వృద్ధి రేటు FY2023నుంచి FY2028 మధ్య 16శాతానికి పెరగవచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. అదే కొత్త కార్ మార్కెట్ ఇదే కాలంలో 1శాతం నుండి 6శాతం వరకు చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.
మధ్యతరగతి ప్రజల్లో పెరుగుతున్న యూజ్డ్ కార్ల అమ్మకంలో ఆదాయం, వ్యక్తిగత కార్ల వినియోగం లో పెరుగుతున్న డిమాండ్ కారణంగా యూజ్డ్ కార్ల మార్కెట్ వేగవంతమైన విస్తరణకు దోహదం చేస్తున్నాయి.
జీఎస్టీ నిర్ణయం.. యూజ్డ్ కార్ల వ్యాపారంపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా కొనుగోలు చేసిన వెహికల్స్ పై డీలర్లు చేసే తరుగుదల క్లెయిమ్ పై ప్రభావం చూపనుంది. ప్రైవేట్‌గా వెహికల్స్ కొనుగోలు చేసే వ్యక్తి లేదా విక్రయించే వ్యక్తులపై పన్ను ప్రభావం ఉండదని చెబుతున్నారు.