కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పారదర్శకంగా నిర్వహించి, గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజినీర్ చాణక్య, 18వ డివిజన్ కార్పొరేటర్ వస్కుల బాబు అన్నారు. ఆదివారం జీడబ్ల్యూఎంసీ పరిధిలోని కాశీబుగ్గ, లక్ష్మీపురం, క్రిస్టియన్కాలనీ, లేబర్కాలనీ, సింగారం, కాజీపేట, వెంకటాద్రినగర్, బాబు క్యాంప్ తదితర ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు.
కార్యక్రమంలో జడ్పీ సీఈవో రామిరెడ్డి, జీడబ్ల్యూఎంసీ అడిషనల్ కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, కృష్ణా రెడ్డి, రెవెన్యూ అధికారులు శ్రీనివాస్, శహజాది బేగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.