- పాతబస్తీలో పర్యటించిన డీజీపీ జితేందర్.. ఏర్పాట్ల పరిశీలన
హైదరాబాద్, వెలుగు:గణేశ్ శోభాయాత్ర బాలాపూర్నుంచి మొదలై చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, లాల్‌దర్వాజా, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎమ్‌జే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్ మీదుగా హుస్సేన్‌సాగర్ చేరుకుంటుందని రాష్ట్ర డీజీపీ జితేందర్తెలిపారు.
19 కిలోమీటర్ల మేర ఊరేగింపు జరుగుతుందని, 25 వేల మందితో పటిష్ఠ బందోబస్త్ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. శనివారం ఆయన రాచకొండ, హైదరాబాద్సీపీలు సుధీర్‌బాబు, సీవీ ఆనంద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్‌అనుదీప్ దురిశెట్టి, పోలీస్అధికారులతో కలిసి శోభాయాత్ర రూట్‌ను పరిశీలించారు.
ముందుగా బాలాపూర్గణేశ్మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ఏర్పాట్లపై చర్చించారు. లడ్డూ వేలం, తరలింపు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం చార్మినార్, ఎమ్‌జే మార్కెట్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సెక్రటేరియట్ పరిసరాల్లో కాలినడకన పర్యటించారు.
స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. అవసరమైన చోట బారికేడ్లు పెట్టాలని సమస్యాత్మక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించాలని ఆదేశించారు.