ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు భారీ ఆపరేషన్.. 19 మంది నక్సలైట్ల అరెస్ట్

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు భారీ ఆపరేషన్.. 19 మంది నక్సలైట్ల అరెస్ట్

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌, కోబ్రా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఈ జాయింట్ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు 19 మంది నక్సలైట్లను అరెస్టు చేశాయి. జాగర్‌గుండ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 మందిని, భెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.  వీరి నుంచి మూడు జిలెటిన్‌ స్టిక్స్, 300 గ్రాముల గన్‌పౌడర్, కార్డెక్స్ వైర్, డిటోనేటర్లు, ఎలక్ట్రిక్ వైర్, బ్యాటరీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ముగ్గురిపై లక్ష రివార్డు

 జాగర్‌గుండలో అదుపులోకి తీసుకున్న 14 మంది నక్సల్స్ 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులని అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురిపై రూ. లక్ష నగదు బహుమతి ఉందని పేర్కొన్నారు. ఆ ముగ్గురిని మిలీషియా కమాండర్ బార్సే హద్మా (25), మావోయిస్ట్‌ల ఫ్రంట్ వింగ్‌లో పనిచేస్తున్న బార్సే నగేష్ (20), హేమ్లా జితు (18) లుగా పోలీసులు గుర్తించారు. ఈ అరెస్ట్ మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి.