ఇంటర్​లో 19 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు

ఇంటర్​లో 19 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ సెకండియర్ లో భారీగా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. శనివారం మ్యాథ్స్ బీ, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరగ్గా, ఏకంగా19 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు పెట్టారు.

 అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది మంది, సంగారెడ్డిలో నలుగురు, మేడ్చల్ లో ఇద్దరు, సిద్దిపేటలో ఇద్దరు, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరిపై కేసులు నమోదయ్యాయి. కాగా, శనివారం మొత్తంగా 3,76,756 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా..3,68,619 మంది  రాశారు. మరో 8,137 మంది వివిధ కారణాలతో అటెండ్ కాలేదు.