రాయ్‌పూర్: సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్, పందొమ్మిదేండ్ల యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఇన్స్టాగ్రామ్ లైవ్ లో తన ఫాలోవర్లు చూస్తుండగా ఇంట్లో ఉరేసుకుంది. ఫాలోవర్లలో ఒకరు ఆమె ఇంటికెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆలోపే యువతి ప్రాణాలు కోల్పోయింది. చత్తీస్‌గఢ్ జాంజ్‌గిర్‌లో జరిగిన ఈ దారుణం గురువారం బయటపడింది.
లవ్ ఫెయిల్యూరే కారణమా?
యువతి అంకుర్నాథ్ జాంజ్‌గిర్ చంపా జిల్లాలోని మిల్టా గ్రామంలో నివాసం ఉంటోంది. ఏం జరిగిందో తెలియదుగానీ, ఆమె ఇన్‌స్టా లైవ్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణానికి పాల్పడుతున్న సమయంలో ఆమె లైవ్‌ను 21 మంది ఫాలోవర్లు చూస్తున్నారు. కామెంట్ల ద్వారా ఆమెను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అంకుర్ తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. అందులో ఒకరు ఆమె ఇంటికి పరిగెత్తుకెళ్లి చూసేసరికి లోపలివైపు లాక్ చేసి ఉంది. దీంతో అతడు చుట్టుపక్కలవాళ్లను అలర్ట్ చేసి డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదని చెప్పారు.
ALSO READ : పాట్నాలో నిరసనకారుల రైల్ రోకో..BPSC ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దుకు డిమాండ్