రాను రాను మనిషిలో విచ్చలవిడితనం, పైశాచికత్వం పెరుగుతోందనటానికి కేరళలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనం. కేరళలోని వల్లికున్నంలో చోటు చేసుకున్న ఈ ఘటన యువతలో పెరుగుతున్న విపరీత ధోరణికి ఉదాహరణగా చెప్పాచ్చు. 19 ఏళ్ళ అమ్మాయి 16ఏళ్ళ పిల్లోడిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఈ ఘటన ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. కేరళలోని వల్లికున్నంలో ఓ 19ఏళ్ళ అమ్మాయి 16ఏళ్ళ అబ్బాయిపై లైంగిక దాడికి పాల్పడింది. వీరిద్దరూ బంధువులే కావడం గమనార్హం.
అమ్మాయి చవర శంకరమంగళం కుంబాలకు చెందినదని కాగా.. అక్కడ వేరే అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు గుర్తించిన అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను బంధువులైన బాధితుడి ఇంట్లో ఉంచారు. ఆ సమయంలో బాధితుడితో సంబంధం పెంచుకుంది నిందితురాలు.
ALSO READ | మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి సీఎం రేవంత్ నివాళి
బాధితుడితో సంబంధం పెంచుకున్న అమ్మాయి.. ఇంట్లో వాళ్ళను ఒప్పించి అతడిని తరచూ బయటకు తీసుకెళ్లేదని.. మైసూరు, పాలకాడ్, పళని, మలప్పురం వంటి ప్రాంతాలకు తీసుకెళ్లి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపాడు నిందితుడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.