జిమ్లో వర్క్ అవుట్ చేస్తుండగా హార్ట్ అటాక్.. ఎంబీబీఎస్ స్టూడెంట్ మృతి

ఇటీవల కాలంలో ఆకస్మిక గుండెపోటుతో మరణాలు ఎక్కువయ్యాయి.. సెలబ్రిటీలనుంచి సాధారణ వ్యక్తుల వరకు కార్డియాక్ అరెస్ట్ లతో చనిపోతున్నారు. ఆటలు ఆడుతూ కొంతమంది కుప్పకూలిపోగా.. మరికొంతమంది స్నానం చేస్తూ.. జిమ్ చేస్తూ కార్డియాక్ అరెస్ట్ లతో మృత్యువాత పడుతున్నారు.. తాజాగా ఓ ట్రైనీ డాక్టర్ జిమ్ లో వర్క్ అవుట్లు చేస్తూ కుప్పకూలిన ఘటన గుజరాత్ లోని జామ్ నగర్ లో చోటు చేసుకుంది. 

గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి మంగళవారం ఆగస్టు 20, 2024న ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి కిషన్ మానెక్ తన వ్యాయామ సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. జిమ్‌లోని సిసిటివి ఫుటేజీలో కిషన్ గుండెపోటుతో అకస్మాత్తుగా నేలపై పడిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. 
మానెక్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మానెక్.. పశ్చిమ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ (PGVCL)లో డిప్యూటీ ఇంజనీర్ హేమంత్ మానెక్ కుమారుడిగా గుర్తించారు. 

ALSO READ | Health Alert : మీ కంటి చూపు మసకగా కనిపిస్తుందా.. అయితే షుగర్ వచ్చే సూచనలు ఎక్కువ..!