ఎండదెబ్బకు ఢిల్లీ విలవిల .. 10 రోజుల్లోనే 192 మంది మృతి

ఎండదెబ్బకు ఢిల్లీ విలవిల ..  10 రోజుల్లోనే 192 మంది మృతి

న్యూఢిల్లీ:  సూర్యుడి ప్రతాపానికి దేశ రాజధాని విలవిల్లాడుతోంది. రికార్డు స్థాయి టెంపరేచర్లతో ఢిల్లీవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జూన్ 11 నుంచి-19 మధ్యలోనే వడదెబ్బ కారణంగా ఏకంగా 192 మంది నిరాశ్రయులు చనిపోయినట్లు సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ (సీహెచ్ఏ) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. దీన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. గడిచిన 48 గంటల్లోనే 50 డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, వారంతా ఎండ వేడిమి కారణంగా చనిపోయారా? మరేదైనా కారణం ఉందా అనే విషయంపై స్పష్టత లేదన్నారు. దొరికిన గుర్తుతెలియని మృతదేహాల్లో 80% నిరాశ్రయులవేనని చెప్పారు. 

ఆసుపత్రుల్లో పెరుగుతున్న చేరికలు..

హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేవ్స్, 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్స్, హీట్ ఎగ్జాషన్ వంటి వేడి- సంబంధిత అనారోగ్య సమస్యలతో చాలా అవస్థలు పడుతున్నారు. బాధితుల్లో ఇండ్లు లేని పేదవారే ఎక్కువగా ఉన్నారు. ఇండ్లల్లో కూలింగ్ ఫెసిలిటీ లేనివారు కూడా తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. గత రెండు రోజులుగా వడదెబ్బ కేసులు, మరణాలపై పలు ఆసుపత్రులు కూడా నివేదిక వెల్లడించాయి. దాని ప్రకారం.. వడదెబ్బతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలోని సఫ్డర్ జంగ్ ఆసుపత్రిలో 33 మంది చేరగా.. వారిలో13 మంది మృతిచెందారు.