చాలామంది కొత్త సంవత్సరం ప్రారంభంలో ఒక విషయం తెలుసుకోవాలనుకుంటారు. అదేమిటంటే.. రాబోయే 12 నెలల్లో తమ జీవితం ఎలా సాగుతుందో.. వారి జీవితాల్లో ఏవైనా అద్భుతాలు జరుగుతాయా అని తెలుసుకునేందుకు ఆస్తక్తి కనబరుస్తారు. దీనికోసం కొత్త సంవ్సతర జాతక ఫలాలు చూపిస్తుంటారు.. పంచాంగం వింటారు. ప్రతి సంవత్సరం ఇలా జాతకాలు, పంచాంగం, రాశీఫలాలు చూసుకోవడం మనకు తెలుసు. అయితే 1924లో అంటే వందేళ్ల క్రితం 2024 జాతకం ఓ పత్రికలో ప్రచురించబడింది.. ఆశ్చర్యంగా లేదు.. ఆ జాతకం ఏ చెబుతుందో ఒకసారి చూద్దాం రండి..
1924లో కొన్ని సంఘటనలను ఓ వార్తాపత్రిక ప్రచురించింది. సరిగ్గా వందేళ్ల తర్వాత జరిగే సంఘటనలు అవి. ఈ పేపర్ కుసంబంధించిన క్లిప్ లు X, Tread లో వైరల్ అవుతున్నాయి. కెనడాలోని కాల్గరీ యూనివర్సిటీ లో రీసెర్చ్ అసోసియేట్ అయిన పాల్ ఫెయిరీ.. 2024 జాతకానికి సంబంధించిన ఈ ఫోటోలను షేర్ చేశారు. అందులో ఒకటి ఏం చెబుతుందటే.. ఈ ఏడాది గుర్రాలు అంతరించిపోతాయట.
ఇంకో జాతకంలో..2024లో ఆటోమొబైల్ రంగం ఒక్కసారిగా ఉప్పెనలా పెరుగుతుందని చెప్పబడింది. అంతేకాడు పోడ్ కాస్ట్ చాలా పాపులర్ అవుతుందని చెప్పబడింది. మరో విషయం ఏమిటంటే.. సినిమాలు ప్రపంచ శాంతిని నెలకొల్పేదిశగా వస్తాయని..ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న సంఘర్షణను తొలగిస్తాయని చెప్పబడింది. OTT ల ఆవిర్భావం, ప్రజాదరణ పొందడంతో ప్రజలు ఎక్కువ టైం ఓటీటీలో సినిమాలు చూస్తూ గడుపుతారని చెప్పబడింది. ఇది నిజం అయింది కదా..
అంతేకాదు 2024కు సంబంధించిన మరో జోస్యం ఏంటంటే.. రైల్లు రెండు మూడు రెట్ల వేగంతో ప్రయాణిస్తాయని.. వాటిలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తూ సినిమాలు చూడొచ్చని కూడా రాసి ఉంది. ఇందులో ఓ వింతైన జోస్యం కూడా ఉంది. అదేంటంటే.. ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి మానవులు ప్రయాణిస్తారని కూడా జోస్యం చెప్పబడింది.
1924లో ప్రచురించిన 2024 జాతకానికి సంబంధించి న పోస్ట్ చేసిన నెటిజన్లు దీనిపై పెద్ద చర్చే పెట్టారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. నిజంగా వండర్.. ఈ జాతకాలను ఎలా ఊహించి రాశారో.. ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. నేను కూడా AI ద్వారా జాతకాలు రాసేలా ప్రోత్సహిస్తుందని చెప్పారు.
మరో నెటిజన్ ఇలా స్పందించారు.. ‘‘ ఇది నిజంగా ఆసక్తి కరంగా ఉంది. 20 శతాబ్ధంలో శ్రామిక సేవలో ఎక్కువగా కనిపించే గుర్రాలు నిజంగానే ఇప్పుడు అక్కడా మాత్రమే కనిపిస్తున్నాయి అని రాశాడు.