తలకొండపల్లి మండలంలో రూ.19.38 లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం : నర్సింహారెడ్డి

ఆమనగల్లు, వెలుగు : తలకొండపల్లి మండలం జూలపల్లి గ్రామంలోని కోళ్ల ఫారంలో అక్రమంగా నిలువ ఉంచిన రూ.19.38 లక్షల విలువ చేసే 1,760 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్​ డీసీపీ నర్సింహారెడ్డి తెలిపారు. మంగళవారం తలకొండపల్లి పోలీస్ స్టేషన్​లో మీడియాతో మాట్లాడుతూ జూలపల్లి మాజీ సర్పంచ్  జైపాల్ రెడ్డి కోళ్ల ఫారంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచినట్లు అందిన సమాచారం మేరకు దాడులు చేసి 9,792 లిక్కర్  బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కోళ్ల ఫారం యజమాని జైపాల్ రెడ్డితో పాటు యాదయ్య, రాజు, లక్ష్మారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీను పాల్గొన్నారు. ఆమనగల్లు పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న 210 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ బలరాం చెప్పారు. మహీంద్రా వెహికల్​లో తరలిస్తుండగా శంషాబాద్  ఎస్వోటీ, స్థానిక పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. 

ALSO READ : ఇసుక, అసైన్డ్ భూములే కనిపిస్తయ్ : జనంపల్లి అనిరుధ్​రెడ్డి