ప్రజావాణికి 196 ఫిర్యాదులు

ప్రజావాణికి 196 ఫిర్యాదులు
  • నిజామాబాద్ జిల్లాలో 95, కామారెడ్డి జిల్లాలో 101

నిజామాబాద్ సిటీ/కామారెడ్డి టౌన్, వెలుగు : నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్​లలో సోమవారం జరిగిన ప్రజావాణికి  భూ సమస్యలు, డబుల్​ బెడ్​రూం ఇండ్లు, శానిటేషన్​ తదితర సమస్యలపై 196 ఫిర్యాదులు వచ్చాయి.  కలెక్టర్​లు రాజీవ్​గాంధీ హనుమంతు, ఆశిష్​ సంగ్వాన్​లు అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. 

దరఖాస్తుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.  నిజామాబాద్​కలెక్టరేట్​లోని ప్రజావాణిలో అదనపు కలెక్టర్​లు అంకిత్​, కిరణ్​కుమార్​, డీపీవో శ్రీనివాస్​, ఆర్డీవో రాజేంద్రకుమార్​, ఏసీపీ శ్రీనివాస్​, మెప్మా పీడీ రాజేందర్ పాల్గొనగా, కామారెడ్డి కలెక్టరేట్​లోని ప్రజావాణిలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.