- మందమర్రి గనుల్లో 75 శాతం బొగ్గు ఉత్పత్తి
- సింగరేణి జీఎం జి.మోహన్ రెడ్డి
కోల్‌బెల్ట్, వెలుగు : కార్మికుల సమష్టి కృషితో మందమర్రి ఏరియాలోని బొగ్గు గనుల్లో 75 శాతం ఉత్పత్తి సాధించామని ఏరియా సింగరేణి జీఎం జి.మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక జీఎం ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జులై నెలలో ఏరియాలోని బొగ్గు గనుల్లో సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు వెల్లడించారు. భారీ వర్షాలు కురిసినప్పటికీ ఏరియాలోని గనుల్లో జులైలో నిర్దేశిత టార్గెట్3,30,500 టన్నులు కాగా.. 75 శాతంతో 2,47642 టన్నుల ఉత్పత్తి సాధించాయన్నారు. వర్షం కారణంగా రామకృష్ణాపూర్ఓసీపీలో 66 వేల టన్నులు, కేకే ఓసీపీలో 1.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టపోయినట్లు చెప్పారు.
మొత్తంగా 1.96లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం జరిగిందన్నారు. కేకే ఓసీపీలో వోల్వో ఆపరేటర్ల సమ్మె కూడా ఉత్పత్తిపై ప్రభావం చూపిందన్నారు. ఈ సమావేశంలో ఏజీఎం(ఈఎం) నాగరాజు, పర్సనల్మేనేజర్శ్యాంసుందర్, డీజీఎం( ఐఈడీ) రాజన్న, సీనియర్ పీవో మైత్రేయబంధు, శాంతి ఖని వెల్ఫేర్ఆఫీసర్శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.
వర్షాలతో ఉత్పత్తికి ఆటంకం
నస్పూర్ : భారీ వర్షాలకు బొగ్గు ఉత్పత్తికి అటంకం కలిగిందని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. జూలైకి సంబంధించిన ఉత్పత్తి 72శాతంగా ఉందని తెలిపారు. ఏరియా పరిధిలో రూ.కోటితో చెత్తను రీసైక్లింగ్ చేసే యూనిట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జనవరి నుంచి ఇప్పపటి వరకు 18 రక్తదాన శిబిరాలు నిర్వహించమని, 3350 మందికి కారుణ్య నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం రవి కుమార్, డీజీఎం(ఐఈడీ) చిరంజీవులు, సీనియర్ పీఓ కాంతరావు, డీవైపీఎం రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
మహిళా ఉద్యోగులకు ఫస్ట్ఎయిడ్ పై ట్రైనింగ్
శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రథమ చికిత్సపై మంగళవారం శిక్షణా తరగతులను జీఎం సంజీవ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. 10 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రాక్టికల్, మౌఖిక పరీక్షలో పాసైనవారికి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైసీఎంఓ డాక్టర్ రమేశ్ బాబు, వృత్తి శిక్షణా కేంద్రం ఎస్ఓఎం కల్లూరి వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.