
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 53,073 కొవిడ్ టెస్టులు చేయగా..1963 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1075, మేడ్చల్ లో 150, రంగారెడ్డి జిల్లాలో 168 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 7,07,162కు చేరింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. కోవిడ్ నుంచి నిన్న 1620 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,017 యాక్టివ్ కేసులున్నాయి.
మరిన్ని వార్తల కోసం..