రాష్ట్రంలో మరో 1982 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 1982 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో 1982 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,982 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దాంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసులు 79,495కు చేరింది.
కరోనా బారినపడి శనివారం 12 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 627కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,869 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 55,999 మంది కోలుకున్నారు.

ఇక జిల్లాల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 463, మేడ్చల్‌లో 141, రంగారెడ్డిలో 139, కరీంనగర్‌లో 96, గద్వాలలో 93, జనగామలో 78, పెద్దపల్లిలో 71, వరంగల్‌ అర్బన్ లో 71, భద్రాద్రిలో 64, కామారెడ్డిలో 62, నల్గొండలో 59, నిజామాబాద్ లో 58, సిద్ధిపేటలో 55 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

For More News..

హీరా గోల్డ్ కేసులో 81 ప్లాట్లు సీజ్

సగం సంక్షేమ హాస్టళ్లు.. కిరాయి బిల్డింగుల్లోనే

కరోనా కష్టాలతో గోల్డ్ అమ్ముకుంటున్నరు